Actress Meena : మీనా కూతురు ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.. !

ఆలనాటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ కెరీర్‌ని మొదలుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది మీనా... 90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన మీనా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ని మీనా వివాహం చేసుకుంది. బెంగుళూరులో ఉంటున్న వీరికి 2011లో నైనికా అనే ఓ అమ్మాయి పుట్టింది.
శుక్రవారం (సెప్టెంబర్ 16) మీనా తన 45వ పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తన కూతురితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నైనికా అచ్చం మీనా లాగే ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. విజయ్ హీరోగా నటించిన 'పోలీసోడు'చిత్రంలో అతనికి కూతురిగా నటించింది నైనిక.
కాగా మీనా సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆదరగోడుతున్నారు. తెలుగులో ఆమె నటించిన దృశ్యం 2 చిత్రం విడుదలకి సిద్దంగా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com