చిరంజీవి సర్జా మరణం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న మేఘన రాజ్.. !

చిరంజీవి సర్జా మరణం తర్వాత కీలక నిర్ణయం తీసుకున్న మేఘన రాజ్.. !
కేవలం 35 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఓ హీరో చనిపోవడం కన్నడ పరిశ్రమని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.

గతేడాది కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే... కేవలం 35 సంవత్సరాల వయసులో అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఓ హీరో చనిపోవడం కన్నడ పరిశ్రమని ఒక్కసారిగా షాక్ కి గురిచేసింది.


చిరంజీవి సర్జా మరణాన్ని జీర్ణించుకోడానికి అభిమానులకి చాలా సమయం పట్టింది. ఇక ఆయన కుటుంబ సభ్యులు అయితే ఇంకా బయటకు రాలేకపోతున్నారు. చిరంజీవి సర్జా మరణించినప్పుడు ఆయన మేఘన రాజ్ భార్య 5 నెలల గర్భవతిగా ఉంది.


భర్త మరణంతో ఆమె ఎంతో కుంగిపోయారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత మేఘన రాజ్ కు అబ్బాయి పుట్టాడు. అతడినికి జూనియర్ చిరంజీవి సర్జా అని నామకరణం చేసారు. లేని తన భర్తను ప్రస్తుతం కొడుకులో చూసుకుంటుంది మేఘన.


ఇదిలా ఉండగా మేఘన రాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. చిరంజీవి సర్జాతో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న మేఘన రాజ్.. మళ్ళీ సినిమాల వైపు ఫోకస్ చేసేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే రెండు సినిమాలకి ఒకే చెప్పింది.


సెల్ఫీ మమ్మీ.. గూగుల్ డాడీ, బుద్ధిమంత 2 అనే కన్నడ సినిమాలో మేఘన రాజ్ నటిస్తుంది. ఈ సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. కాగా కన్నడ, తమిళ పరిశ్రమలో మేఘన రాజ్ కి మంచి క్రేజ్ ఉంది.


ఇక తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా శ్రీకాంత్ హీరోగా వచ్చిన లక్కీ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

Tags

Read MoreRead Less
Next Story