ఓటీటీలో పూర్ణ 'బ్యాక్ డోర్‌'

ఓటీటీలో పూర్ణ బ్యాక్ డోర్‌
మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న పూర్ణ

వైవిధ్యమైన కథా, కథనాలకు ఓటీటీలు వేదికగా మారాయి. కథలో దమ్ముంటే చిన్న చిత్రాలకు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇదే కోవలో పూర్ణ హీరోయిన్ గా నటించిన బ్యాక్ డోర్ సినిమా గత ఏడాది థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఆర్చిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ మీద బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. పూర్ణకు జోడీగా కొత్త కుర్రాడు తేజ నటించాడు. రెండే రెండు పాత్రలతో, ఆడవాళ్ళ మనోభావాల్ని, కుటుంబ విలువల్ని, భార్యాభర్తల సంబంధాల్ని, అక్రమ సంబంధాలు వల్ల వచ్చే నష్టాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించి మంచి సందేశం ఇచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. రెండు గంటల నిడివి గల ఈ చిత్రంలో రెండే పాత్రలతో నడిపించడంలో దర్శకుడు తన ప్రతిభ కనబరిచారు. పూర్ణ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. సినిమాటోగ్రాఫర్ మంచి విజువల్స్ అందించారు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ చోట కే ప్రసాద్ తన మార్కుని చూపించారు. ఇలా బ్యాక్ డోర్ సినిమా ఇప్పుడు అన్ని రకాలుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story