న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌.. అలా చేస్తే ఓకే అన్న హీరోయిన్..!

న్యూడ్‌ ఫోటో అడిగిన నెటిజన్‌.. అలా చేస్తే ఓకే అన్న హీరోయిన్..!
అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది నటుల్లో ప్రియమణి ఒకరు.. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.

అందంతో పాటు మంచి అభినయం ఉన్న అతికొద్ది మంది నటుల్లో ప్రియమణి ఒకరు.. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పెళ్ళైనకొత్తలో, గోలీమార్, శంభో శివ శంభో, యమదొంగ మొదలగు చిత్రాలలో నటించింది. ఇక 2017లో ముస్తఫా రాజ్‌ను వివాహం చేసుకున్న ప్రియమణి.. ఆ తర్వాత సినిమాలకి కాస్తా బ్రేక్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోతుంది. ప్రస్తుతం రానా హీరోగా వస్తున్న విరాటపర్వం సినిమాలో కీలకపాత్రలో నటిస్తుంది. వెంకటేష్ హీరోగా వస్తున్న నారప్పలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా... తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో బ్లాక్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోలని షేర్‌ చేసింది ప్రియమణి.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా.. ఓ నెటిజన్ మాత్రం అభాసుపాలయ్యాడు.. ఇంతకీ ఏం జరిగిందటే.. మీ న్యూడ్‌ ఫోటో షేర్‌ చేయండంటూ అంటూ కామెంట్ చేశాడు ఆ నెటిజన్.. దీనికి ప్రియమణి దిమ్మతిరగే జవాబు ఇచ్చింది.


"నా కంటే ముందు మీ సోదరిని లేదా మీ తల్లి గానీ అలాంటి ఫోటో అడిగి షేర్‌ చేయండి.. అప్పుడు నేను కూడా పెడతా" అంటూ కౌంటర్ ఇచ్చింది. ఈ సమాధానం తరవాత సదరు నెటిజన్.. ప్రియమణిని క్షమాపణలు కోరాడు.. ప్రియమణి ఇచ్చిన సమాధానంపై పలువులు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. సరైనా సమాధానం ఇచ్చారు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story