సౌందర్యతో ఆ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా : రమ్యకృష్ణ

సౌందర్యతో ఆ సీన్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డా : రమ్యకృష్ణ
ఇందులో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ నీలాంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. సినిమాలో రజినీకాంత్ పాత్రకి సమానంగా ఆమె పాత్ర ఉంటుంది.

గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా పవర్ ఫుల్ పాత్రలకి పెట్టింది పేరు నటి రమ్యకృష్ణ.. కెరీర్ మొదట్లో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆమె కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో రజినీకాంత్, కే.యస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన "నరసింహ" చిత్రం ఒకటి.

ఇందులో సౌందర్య మెయిన్ హీరోయిన్ గా నటించగా, రమ్యకృష్ణ నీలాంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. సినిమాలో రజినీకాంత్ పాత్రకి సమానంగా ఆమె పాత్ర ఉంటుంది. అయితే ఈ సినిమాలో సౌందర్య మొఖం పైన కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తానూ చాలా ఇబ్బంది పడ్డానని ఓ ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ వెల్లడించింది. అయితే దర్శకుడు కన్వీన్స్ చేయడంతో దర్శకుడిని నమ్మీ ఆ సీన్ చేశానని ఆమె వెల్లడించింది.

అయితే ఒకవేళ ఈ సినిమాలో నీలాంబరి పాత్ర కావాలా లేకా సౌందర్య పాత్ర కావాలా అని తనను దర్శకుడు అడిగి ఉంటే తాను కచ్చితంగా సౌందర్య పాత్రనే ఎంచుకునేదాన్నని రమ్యకృష్ణ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో నీలాంబరి పాత్రకి రమ్యకృష్ణకి ఎంత మంచి పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రమ్యకృష్ణ దూసుకుపోతుంది. తన భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగామర్తండ సినిమాలో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story