బుల్లితెర సూపర్‌స్టార్.. 'రాములమ్మ'గా ఆదరగోట్టింది.. !

జబర్దస్త్‌లో కమెడియన్‌గా రాణిస్తూనే యాంకర్ కూడా ఆదరగోడుతున్నాడు నటుడు సుడిగాలి సుధీర్. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్ షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ప్రతి ఆదివారం సాయంత్రం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకి బుల్లితెర పైన మంచి క్రేజ్ ఉంది. ఆగష్టు 29న ప్రసారం కానున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఎప్పటిలాగే ఈ షోలో లేడీ సెలబ్రిటీలు సందడి చేశారు. నటి హేమ చేసిన సందడి కడుపుబ్బా నవ్వించగా, పవన్‌కళ్యాణ్‌కి అడ్వాన్స్‌గా బర్త్‌డే విషెస్ అందిస్తూ చేసిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
అయితే ప్రోమో చివర్లో రోహిణి చేసిన పెర్ఫార్మన్స్ అందరిచేత చప్పట్లు కొట్టించింది. "A special Tribute To vijayashanti" అంటూ రాములమ్మ సినిమాలోని ఓ సన్నివేశాన్ని కళ్ళకి కట్టినట్టుగా స్టేజీ పైన చేసి చూపించింది రోహిణి.. రోహిణి పెర్ఫార్మన్స్ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. సినిమాకి లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి.. టీవీకి సూపర్ స్టార్ అంటే రోహిణి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఓ ఫోక్ సాంగ్‌కి ఇంద్రజ వేసిన స్టెప్పులు అదరహో అనిపించాయి. ఈ ప్రోమో పైన మీరు కూడా ఓ లుక్కేయండి..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com