Actress Roja: నటి కాకుండానే అవార్డ్ అందుకున్న రోజా కూతురు.. ఎందుకంటే..?

Actress Roja: మామూలుగా సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటీనటులు.. తమ వారసులను కూడా నటులగానే ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆశపడుతుంటారు. కానీ ఈ జెనరేషన్ వారు అలా చేయడానికి ఇష్టపడడం లేదు. తల్లిదండ్రులు ఇండస్ట్రీలో గుర్తింపు పొందినవారే అయినా.. వారు కూడా తమకంటూ సొంత గుర్తింపు ఉండాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా నటి రోజా కూతురు కూడా అలాగే చేస్తోంది.
రోజా.. తమిళ దర్శక నిర్మాత సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పటికే రోజా.. పలు సందర్భాల్లో తన కూతురు అన్షు మాలికను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అంతే కాకుండా అన్షును హీరోయిన్ చేయాలని రోజా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవేవి నిజం కాదని తేలిపోయింది. తాజాగా అందరికీ షాకిస్తూ అన్షు ఓ కొత్త కెరీర్‌ను ఎంచుకుంది.
ప్రస్తుతం అన్షు మాలిక వయసు 18 ఏళ్లు. కానీ ఇప్పటికే తాను వెబ్ డెవలపర్‌గా, కంటెంట్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా 'ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్' అనే నవల కూడా రాసింది. ఈ నవల ద్వారా అన్షు.. బెస్ట్ ఆథర్ ఇన్ సౌత్ ఇండియా అవార్డును అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అవార్డు అందుకున్న ఫోటోను అన్షు, తన తల్లి రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com