Samantha on rumours: అఫైర్స్ , అబార్షన్, రూమర్స్ ... స్పందించిన సమంత..!

Samantha on rumour : చైసామ్ విడిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వీరిద్దరూ ఎందుకు విడిపోతున్నారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న అనేక రూమర్స్ పైన సమంత కొద్దిసేపటి క్రితమే స్పందించింది. తనకి ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్లు చేసుకున్నానని అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
ఇప్పటికే విడాకుల బాధ నుంచి బయటకు రావడం లేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా ఎటాక్ చేయడం సరికాదని వెల్లడించింది. అయితే ఎవరేమన్నా అవి తనపైన ప్రభావం చూపవని, ఇలాంటి సమయంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని చెప్పింది సామ్.. కాగా ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతల మూవీని కంప్లీట్ చేసిన సామ్.. తమిళ్ లో ఓ సినిమాని చేస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com