చైకి విడాకులిచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం..: శామ్ రిప్లై

చైకి విడాకులిచ్చేయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం..: శామ్ రిప్లై
సూపర్ రిప్లై..

ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య, సమంత కొన్ని సినిమాల్లో కలిసి నటించారు.. ఈ మధ్య వచ్చే ప్రకటనల్లో కూడా వారిద్దరూ జంటగా కనిపిస్తున్నారు. చైతన్య సోషల్ మీడియాలో అంత యాక్టివ్ పార్ట్ కాదు.. కానీ సమంత ఆలోటును భర్తీ చేస్తుంది. చిన్న చిన్న సంతోషాలను,, అభిమానులతో పంచుకోవాలనుకున్న ముచ్చట్లని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఓ నెటిజన్ సమంతతో ' చై కి విడాకులిచ్చెయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని కామెంట్ చేశాడు.. ఆ విషయాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకున్న సమంత ' కష్టం.. ఒక పని చెయ్.. చై ని అడుగు' అని రిప్లై ఇచ్చింది. సమంత సమాధానానికి ఫిదా అయిపోయిన నెటిజన్లు.. సూపర్ రిప్లై.. ఎంతైనా సమంత గ్రేట్ అంటూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story