అప్పుడు ఐరెన్ లెగ్.. ఇప్పుడు హిట్లిచ్చే అదృష్టదేవత!

అప్పుడు ఐరెన్ లెగ్.. ఇప్పుడు హిట్లిచ్చే అదృష్టదేవత!
యాక్టింగ్, డాన్సింగ్ లో అదరగొడుతున్నప్పటికి ముందుగా ఆమె చేసినా.. ఏ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది.

విలక్షణ నటుడు కమల్ హసన్ నటవారసురాలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్.. యాక్టింగ్, డాన్సింగ్ లో అదరగొడుతున్నప్పటికి ముందుగా ఆమె చేసినా.. ఏ సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. దీనితో ఆమెను తీసుకోవడనికే హీరోలు, నిర్మాతలు తటపటాయించేవాళ్లు. కానీ పవన్ కళ్యాణ్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఆమె స్థాయిని అమాంతం పెంచేసింది. ఇప్పుడు శృతిహాసన్ అంటే ఐరెన్ లెగ్ కాదు.. గోల్డెన్ హ్యాండ్ అనే రేంజ్ కి చేరుకుంది.

ఇవి ఎవరో అంటున్న మాటలు కాదు.. ఆమె ట్రాక్ రికార్డులు చెపుతున్నాయి. గబ్బర్ సింగ్ సినిమాకి ముందు వరుస ప్లాపుల్లో ఉన్నాడు పవన్.. పులి, తీన్ మార్, పంజా సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత శృతితో చేసిన గబ్బర్ సింగ్ భారీ హిట్ అయింది. దీనితో మళ్ళీ పవర్ స్టార్ కు వరుస సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు పవన్ రీఎంట్రీగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతిహసనే హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక రవితేజ విషయానికి వస్తే.. టచ్ చేసి చూడు, నేలటిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కోరాజా సినిమాలతో ఫుల్ ఫ్లాప్ లతో ఉన్న రవితేజ.. ఈ మధ్య క్రాక్ సినిమాతో హిట్ మెట్టు ఎక్కాడు. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహసన్ హీరోయిన్ గా నటించింది. అటు 1-నేనొక్కడినే, ఆగడు వరుస ప్లాపులలో ఉన్న మహేష్ శ్రీమంతుడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమాలో కూడా శృతిహాసన్ హీరోయిన్ కావడం విశేషం. ఇలా ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లు ఇచ్చే అదృష్టదేవతగా శృతిహాసన్ మారిపోయిందంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story