నాలుగు కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా.. ఆ దైర్యం నాకుంది : వనితా విజయ్‌‌‌కుమార్

నాలుగు కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా.. ఆ దైర్యం నాకుంది : వనితా విజయ్‌‌‌కుమార్
వనితా విజయ్‌‌‌కుమార్.. ఈ నటి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. సీనియర్ నటీనటులు విజయ్‌‌కుమార్, మంజుల దంపతుల కుమార్తె..

వనితా విజయ్‌‌‌కుమార్.. ఈ నటి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. సీనియర్ నటీనటులు విజయ్‌‌కుమార్, మంజుల దంపతుల కుమార్తె.. సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతో ఈమె వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. వనితా విజయ్‌కుమార్.. తాజాగా తమిళ పవర్‌‌‌‌స్టార్‌ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో షేర్‌ చేసింది. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను చూసి నెటిజన్లు వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి చేసుకుందంటూ ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారాయి. తాజాగా దీనిపైన ఆమె స్పందించారు. ఇది నిజమైన పెళ్లి కాదని 'పికప్‌ డ్రాప్‌' అనే చిత్రానికి సంబంధించిన ఫొటో అని ఆమె వివరణ ఇచ్చింది.


అంతేకాకుండా మహిళా సాధికారత గురించి ఆమె ప్రధానంగా మాట్లాడుతూ.." మహిళలకు తమ భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్ఛ అవసరం. పురుషులు ఇద్దరు, ముగ్గురిని వివాహం చేసుకుంటే ఎవరూ ప్రశ్నించరు. కానీ ఒక స్త్రీ అలా చేస్తే.. దానిని తప్పుగా చూస్తారు. ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకూడదని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. కొన్నిసార్లు ఇలా మాట్లాడడం వలన ఆత్మహత్యకు దారితీస్తాయి. ఎవరైనా ఒంటరిగా ఉంటారా లేదా వివాహం చేసుకుంటారా అనేది వారి వ్యక్తిగత విషయం. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోకూడదు. మీకు 40 ఏళ్ళ వయసులో నాలుగో వివాహం అవసరమా? ఇలాంటి అనవసరమైన విషయాలను తప్పించి మంచి విషయాల గురించి మాట్లాడండి. నాలుగు కాదు 40 పెళ్లిళ్లు చేసుకునే ధైర్యం కూడా నాకుంది. అది నా వ్యక్తిగత విషయం. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు.. కానీ ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవడం మానుకోవాలి" అని ఆమె తెలిపారు.


కాగా 1995లో 'చంద్రలేఖ' అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో విజయ్‌‌‌కి జోడిగా నటించింది. ఇక తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో కీ రోల్ పోషించింది. అటు వనిత విజయ్‌కుమార్‌.. 2000లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకొని 2007లో అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ని పెళ్లి చేసుకుంది. 2012లో అతని నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం పీటర్ పాల్ అనే వ్యక్తిని అక్టోబర్ 2020లో వివాహం చేసుకొని పరస్పర అంగీకారంతో అతనితో విడాకులు తీసుకుంది.


Tags

Read MoreRead Less
Next Story