అందుకే విజయశాంతితో అన్ని సినిమాలు చేసిన చిరు..!

అందుకే విజయశాంతితో అన్ని సినిమాలు చేసిన చిరు..!
నలబై సంవత్సరాల సినీ కెరీర్‌‌లో మూడు జనరేషన్ల హీరోయిన్ లతో కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ కెరీర్‌‌లో హీరోయిన్లది కూడా కీలక పాత్రేనని చెప్పాలి.

నలబై సంవత్సరాల సినీ కెరీర్‌‌లో మూడు జనరేషన్ల హీరోయిన్ లతో కలిసి నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన సినీ కెరీర్‌‌లో హీరోయిన్లది కూడా కీలక పాత్రేనని చెప్పాలి. ఇప్పటివరకు 151సినిమాలలో నటించిన చిరంజీవి... దాదాపుగా 60 మంది హీరోయిన్ లతో కలిసి నటించారు. అయితే ఇందులో కొందరితోనే ఆయన కాంబినేషన్ వర్కౌట్ అయింది. అందులో రాధిక, విజయశాంతి, రాధ ఉన్నారు. వీరితో చిరంజీవి చేసిన సినిమాలు మంచి హిట్లు అనిపించుకున్నాయి. 1992కి ముందు చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసింది రాధికే.

అయితే ఆ తర్వాత విజయశాంతి ఆమెను అధిగమించింది. చిరంజీవికి రాధికతో కంటే విజయశాంతితోనే ఎక్కువగా హిట్లు ఉండడం విశేషం. 1983లో విజయశాంతి,చిరంజీవి సంఘర్షణ సినిమాతో జోడి కట్టింది. అయితే ఈ సినిమాలో విజయశాంతిది రెండో హీరోయిన్ పాత్ర. నలిని మెయిన్ హీరోయిన్.. ఆ తర్వాత ఛాలెంజ్, మహానగరంలో మాయగాడు, దేవాంతకుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, మెకానిక్ అల్లుడు, స్వయంకృషి, గ్యాంగ్ లీడర్, కొండవీటి దొంగ వంటి చిత్రాలు వచ్చాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన గ్యాంగ్‌‌లీడర్ చిత్రం సరికొత్త వసూళ్ళను సాధించింది.

దీనితో చిరు, విజయశాంతి పెయిర్ కి మంచి పేరొచ్చింది. అయితే ఇదే వీరి కాంబినేషన్‌‌‌లో వచ్చిన చివరి చిత్రమని అనుకుంటారు ప్రేక్షకులు.. కానీ మెకానిక్ అల్లుడు వీరి చివరిచిత్రం. పదేళ్ళ కాలంలో 19 చిత్రాలలో వీరు నటించారు. అంతేకాకుండా అత్యధిక పారితోషకం తీసుకున్న జంట వీరే కావడం విషేశం. ఇక రాధతో చిరంజీవి కాంబినేషన్‌‌కి మంచి పేరొచ్చింది. చిరంజీవికి తగ్గట్టుగా రాధ కూడా డాన్స్ చేసింది. కానీ ప్రేక్షకులు ఎక్కువగా విజయశాంతి, చిరంజీవి కాంబినేషన్‌‌ని ఇష్టపడేవారు. అందుకే దర్శకులు, నిర్మాతలు ఎక్కువగా వీరి కాంబినేషన్‌‌తో సినిమాలు చేయడానికి ఇష్టపడేవారు.

Tags

Read MoreRead Less
Next Story