అదరగొడుతున్న ఆదిపురుషుడు

అదరగొడుతున్న ఆదిపురుషుడు
సంబరాలకు చేసుకుంటున్న ప్రభాస్ అభిమానులు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రాముడిగా తమ హీరోను స్క్రీన్ మీద చూడటానికి ఉవ్విళ్ళు ఊరిన ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ లలో కూర్చొని పండగ చేసుకుంటున్నారు. నిజానికి ఆదిపురుష్ కోసం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇతర హీరోల ఫ్యాన్స్, ఆడియన్స్ సైతం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీంతో సోషల్ మీడియా మొత్తంగా ప్రస్తుతం ఆదిపురుష్ మేనియాతో షేక్ అవుతోంది. ఆదిపురుష్ హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది.

సినిమా థియేటర్ లలో ఉన్నవాళ్లు వాట్సాప్ స్టేటస్ లు, సోషల్ మీడియా పోస్ట్ లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ట్విట్టర్ లో రివ్యూ లకు కోదువే లేదు. కొందరు ఆదిపురుషుడిని ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇంకొందరు కాస్త కిందకి లాగటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఏ నటుడి ఫాన్స్ అయినా గానీ ప్రభాస్ నటనని ఒక్క మాట కూడా అనకపోవటం గమనార్హం. కృతి సనన్, సైఫ్ నటన అద్భుతమని, వి ఎఫ్ ఎక్స్ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. సినిమాకి పాటలు మరో అదనపు ఆకర్షణగా చెబుతున్నారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అజయ్-అతుల్ సక్సెస్ అయినట్టే.

ముందు ఫస్ట్ ఆఫ్ బావుంది అన్న ప్రేక్షకులు, సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ ఆఫ్ ఇంకా బాగుంది అని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్ చాలా పూర్ గా ఉన్నాయి అన్నమాట కూడా వినిపిస్తోంది. 500 కోట్ల బడ్జెట్ పెట్టిన ఈ సినిమా టీజర్ విడుదలైన రోజు నుంచే ఈ లోపం ఉందన్న విమర్శలు వచ్చాయి. అలాగే లంకేశ్వరుడిగా సైఫ్ నటన బాగున్నప్పటికీ లుక్ విషయంలో కూడా చిన్న అసంతృప్తి కనిపిస్తోంది. గ్రాఫిక్స్ 2D వెర్షన్ లో కంటే 3D వెర్షన్లో ఇంకా బాగుండచ్చని, వీలైతే నేను సినిమాను త్రీడీలో చూడమని కొంతమంది ఆడియన్స్ సలహా ఇస్తున్నారు.

రాముడు, రావణాసురుడు ఎంట్రీలు, శబరి, సుగ్రీవుడితో రాముడి సమావేశలు, హనుమాన్ లంకా దహనం సినిమాకు హైలెట్ గా చెబుతున్నారు. రాములవారి సినిమాకు హనుమంతుడు విచ్చేస్తాడని, స్వామికీ ఒక సీట్ కేటాయించండంటూ చేసిన ప్రచారం ఫలించింది. అని థియేటర్ లలోనూ హనుమాన్ జీ కి ఓ సీట్ కేటాయించగా ఒక థియేటర్ లో కోతి వచ్చి ఆ సీట్లో కూర్చోవడంతో హనుమాన్ జీ వాచింగ్ అంటూ ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాముడితో పాటు దశరధుని పాత్రలో కూడా ప్రభాస్ కనపడడం అభిమానులకు సర్ప్రైస్ గా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story