Adi Purush : దసరా నవరాత్రుల నుంచి ప్రమోషన్స్ షురూ..

Adi Purush : ఆది పురుష్ సినిమా హంగామా దాదాపు మొదటైనట్లే. ఇపటికే సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అతి పెద్ద ప్యాన్ ఇండియా చిత్రం 'ఆదిపురుష్' జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకొని దర్శకుడు ఓం రౌత్ దీన్ని తెరకెక్కించారు. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా క్రితి సనన్, రావణాసుడిగా సైఫ్‌అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
అయితే మూవీ ప్రమోషన్స్‌ను దసరా నవరాత్రుల నుంచి మొదలుపెట్టే యోచనలో మేకర్స్ ఉన్నారు. అక్టోబర్ 3న టీజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఇక అప్పటి నుంచి మూడు నెలల వరకు ప్రమోషన్ క్యాంపెయినింగ్ చేయనున్నారు. సుమారు రూ.500 కోట్ల రూపాయలతో భూషన్ కుమార్ దీన్ని తెరకెక్కించారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com