Adivi Sesh: స్కూలు పిల్లల కోసం 'మేజర్' ఆఫర్.. సందీప్ గురించి వారికి తెలియాలంటూ..

Adivi Sesh: ఇప్పటివరకు దేశభక్తి కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని నిజ జీవిత కథల ఆధారంగా తెరకెక్కాయి కూడా. అలాంటి గుర్తుండిపోయే కథలలో ఒకటిగా నిలిచిపోయే సినిమా 'మేజర్'. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది. ఇప్పుడు స్కూలు పిల్లల కోసం మేజర్ టీమ్ ఓ స్పెషల్ గిఫ్ట్‌ను ప్లాన్ చేసింది.
ముంబాయి దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథే మేజర్. ఈ సినిమాతో హీరో అడవి శేష్ నటుడిగా మరో మెట్టు ఎక్కేశాడు. ఇలాంటి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు తాను ఎన్నో ప్రశంసలను పొందుతున్నాడు. అంతే కాకుండా ఆర్మీలో చేరాలనుకుంటున్న వారికి సాయం చేస్తానని మేజర్ ప్రామిస్ చేసింది మూవీ టీమ్. ఇప్పుడు స్కూలు పిల్లలకు కూడా ఓ ఆఫర్‌తో ముందుకొచ్చింది.
అడవి శేష్ ఇటీవల తన సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు. ఇందులో మేజర్ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. చిన్నపిల్లలు కూడా తన సినిమా బాగుందని ఫోన్ చేసి చెప్తున్నారు. వారు కూడా మేజర్ లాగా దేశం కోసం పోరాడతామని అంటున్నారని అన్నాడు. ఈ సినిమా పిల్లలకు కూడా నచ్చుతుందని తాము అనుకోలేదని, అందుకే వారి కోసం ఓ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపాడు.
ఇంకా చాలామంది విద్యార్థులు మేజర్ గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందాలని, అందుకే గ్రూప్ టికెట్లపై స్కూళ్లకు రాయితీ కల్పిస్తున్నట్టు తెలిపాడు అడవి శేష్. ఈ నిర్ణయం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రేపటి తరానికి సందీప్ గురించి తెలియడమే అన్నాడు. ఫార్మ్ ఫిల్ చేస్తే ఈ ఆఫర్ లభిస్తుందని ఓ వాట్సాప్ నెంబర్‌ను పోస్ట్ చేశాడు అడవి శేష్.
Decided to make it even easier for schools, especially govt schools.
— Adivi Sesh (@AdiviSesh) June 15, 2022
You can also fill this form out https://t.co/1xi64JXoUe
Or WhatsApp this number
9703916305#IndiaLovesMAJOR 🇮🇳❤️ https://t.co/xlXjRcTiev
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com