Adivi Sesh: 'విక్రమ్ చూడాలా? మేజర్ చూడాలా?'.. నెటిజన్ ప్రశ్న.. అడవి శేష్ రిప్లై..

Adivi Sesh: విక్రమ్ చూడాలా? మేజర్ చూడాలా?.. నెటిజన్ ప్రశ్న.. అడవి శేష్ రిప్లై..
Adivi Sesh: మేజర్ చిత్రం.. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్‌'కు పోటీగా థియేటర్లలో విడుదలయ్యింది.

Adivi Sesh: టాలీవుడ్‌లోని మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యే్ స్థానాన్ని సంపాదించుకున్నాడు అడవి శేష్. అడవి శేష్ నటించాడంటే సినిమా సూపర్ హిట్ అని ఇప్పటికీ ఎంతోమంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. అదే విషయాన్ని మరోసారి 'మేజర్'తో నిరూపించాడు ఈ హీరో. ఇక తాజాగా మేజర్ లేదా విక్రమ్ అన్న అంశంపై ఓ నెటిజన్ ప్రశ్నించగా.. అడవి శేష్ దానికి చాలా స్వీట్‌గా రిప్లై ఇచ్చాడు.

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం.. కమల్ హాసన్ నటించిన 'విక్రమ్‌'కు పోటీగా థియేటర్లలో విడుదలయ్యింది. ఈ రెండు సినిమాలు ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉన్నాయి. రెండు పెద్ద చిత్రాలు ఒకటేరోజు విడుదలయ్యి బ్లాక్ బస్టర్ సాధించి చాలాకాలం అవ్వడంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్లలో ముందు ఏ సినిమా చూడాలా అన్న కన్ఫ్యూజన్‌లో పడ్డారు. ఇదే విషయంపై ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

'నేను కమల్ హాసన్ సార్‌కు పెద్ద ఫ్యాన్. కానీ విక్రమ్, మేజర్ సినిమాల్లో ముందుగా ఏ సినిమా చూస్తావని అడిగితే.. ముందు మేజర్ పేరు చెప్పి తర్వాత విక్రమ్ అంటాను.' అన్నాడు ఓ నెటిజన్. దీనికి సమాధానంగా అడవి శేష్ 'నేను మిమ్మల్ని రెండు సినిమాలు చూడాలని రిక్వెస్ట్ చేస్తాను. మీతో పాటు నేను కూడా కమల్ సార్ ఫ్యాన్‌నే.' అని ట్వీట్ చేశాడు. ఇక అడవి శేష్ స్వీట్ రిప్లైకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Tags

Next Story