Chiranjeevi Lucifar :15 ఏళ్ల తరువాత 'చిరు'తో కలిసి చిందేయనున్న భామ
Chiranjeevi Lucifar
Chiranjeevi Lucifar: 60 ఏళ్లు వచ్చినా ఆయనతో కలిసి నటించడమంటే హీరోయిన్లకు అదో సరదా.. చిరుతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు హీరోయిన్లు. వచ్చిన అవకాశాన్ని వదులు కోవడానికి ఏ హీరోయిన్ ఇష్టపడదు. అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం ఆడి పాడిన త్రిషకు ఇప్పుడు మళ్లీ చిరు నటిస్తున్న లూసిఫర్ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. 2006 వచ్చిన స్టాలిన్‌లో చిరు పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసిన త్రిష .. ఆ తరువాత మరే చిత్రంలోనూ అతడితో కలిసి నటించే అవకాశం రాలేదు.
ఆమధ్య కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రంలో నటించే అవకాశం వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. కాగా లూసిఫర్‌లో మొదట నయనతార అనుకున్నా వ్యక్తిగత కారణాల వలన ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో ఆ ఛాన్స్ త్రిషకు వచ్చిందన్న వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com