Agninakshatram: 'తెలుసా తెలుసా' సాంగ్ లాంచ్ చేసిన సమంత

Agninakshatram: తెలుసా తెలుసా సాంగ్ లాంచ్ చేసిన సమంత
మంచులక్ష్మి సాంగ్ ను లాంచ్ చేసిన సమంత; అగ్నినక్షత్రంలో లీడ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి

మంచు లక్ష్మీ మరోసారి లీడ్ రోల్ లో మెరిసిన చిత్రం అగ్న నక్షత్రం. మంచువారి అమ్మాయి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోందన్న సంగతి తెలిసిందే. ఇక పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ తో కూడుకున్న ఈ మూవీ సాంగ్ ను టాలీవుడ్ చార్మింగ్ లేడీ సమంత లాంచ్ చేయడంతో సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి. మహిళా దినోత్సవం సందర్బంగా ఈ పాటను తన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. ఇక పాటలో మంచు లక్ష్మి తనయ విద్యా నిర్వాణ కూడా తళుక్కుమనడం మరో విశేషం. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్లతో పాటు భారీ తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం సమకూర్చారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించారు.

Next Story