Mahesh Babu: క్రేజీ రూమర్ వైరల్.. మహేశ్‌కు జోడీగా ఐశ్వర్య రాయ్..

Mahesh Babu: కొన్ని సినిమాలు ప్రారంభం అవ్వకముందే వాటిపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఆ డైరెక్టర్ లేదా హీరో మీద ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం అలాంటిది. అలాగే మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తుంది అనగానే ఆడియన్స్ రియాక్షన్ కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ మూవీ నుండి మరో క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.
రాజమౌళి సినిమా అనగానే భాషలో సంబంధం లేకుండా టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు చాలామంది నటీనటులు యాక్ట్ చేయడానికి ఇష్టపడతారు. సినీ పరిశ్రమలో రాజమౌళి క్రియేట్ చేసిన మార్క్ అలాంటిది. అయితే మహేశ్‌తో రాజమౌళి చేసే మూవీ ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని ఇప్పటికే దాదాపు ఖరారైంది. అంతే కాకుండా ఈ మూవీలో సీనియర్ బాలీవుడ్ నటి ఉండబోతుందని కూడా టాక్ మొదలయ్యింది.
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్.. మహేశ్ బాబు, రాజమౌళి మూవీలో ఓ కీలక పాత్రలో నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కూడా లీడ్ యాక్టర్స్‌తో సమానంగా ఉండబోతుందట. అంతే కాకుండా దీని గురించి మరో రూమర్ కూడా వైరల్ అయ్యింది. మహేశ్ సరసన హీరోయిన్‌గా ఐశ్వర్యనే నటిస్తుందని.. మరి ఈ రెండిటిలో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియాలంటే చాలాసమయమే పడుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com