అల్లు అర్జున్‌‌‌కి చెల్లిలిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్?

అల్లు అర్జున్‌‌‌కి చెల్లిలిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్?
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవ‌ర్‌గా నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ న‌టించ‌నున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె బ‌న్నీకు చెల్లెలుగా క‌నిపించ‌నున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఐశ్వర్యా అనుకోని పరిస్థితుల్లో చ‌నిపోతుంద‌ని, దీనికి ఓ పోలీసు అధికారే కార‌ణం అవుతాడ‌ని, దీంతో అత‌డిపై పుష్పరాజ్ ఎలా ప‌గ తీర్చుకుంటాడ‌న్నది మిగతా కథ అని తెలుస్తుంది.

మరి ఈ పాత్రకి ఐశ్వర్యా రాజేష్ ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ‌భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story