Akhil Akkineni: పవన్ మూవీ టైటిల్స్‌పై మనసు పారేసుకుంటున్న హీరోలు.. ఇప్పుడు అఖిల్ కూడా..

Akhil Akkineni: రోజుకి ఎన్నో సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ఒక సినిమాపై ప్రేక్షకుల్లో ఎగ్జైట్‌మెంట్ పెంచాలంటే దానికి ఫస్ట్ స్టెప్ టైటిల్. ప్రస్తుతం కొందరు దర్శకులు టైటిల్స్ గురించి ఎక్కువ కష్టపడకుండా.. తమ కథకు సెట్ అయితే చాలు.. పాత క్లాసిక్ కథల టైటిల్స్‌ను తెచ్చి వారి సినిమాలకు పెట్టేసుకుంటున్నారు. అందులోనూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్స్‌పై యంగ్ హీరోలు మనసు పారేసుకుంటున్నారు.
మెగా హీరోల సినిమా టైటిల్స్ ఇప్పటికీ చాలామంది హీరోలు రిపీట్ చేశారు. పవన్ కళ్యాణ్ అనే కాదు.. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్‌ను కూడా చాలామంది ఉపయోగించారు. కానీ ఇటీవల యంగ్ హీరోలంతా పవన్ టైటిల్స్‌పై పడ్డారు. కొన్నాళ్ల క్రితం పవన్ 'తొలిప్రేమ' టైటిల్‌తో సినిమా చేశాడు వరుణ్ తేజ్. తాజాగా విజయ్ దేవరకొండ 'ఖుషి' అనే టైటిల్‌తో వస్తున్నాడు. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా వీరి దారిలోనే వెళ్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతం 'ఏజెంట్' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న అఖిల్.. ఆ తర్వాత వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్‌తో కలిసి సినిమా చేయనున్నట్టు టాక్. అయితే ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ క్లాసిక్ మూవీ 'తమ్ముడు' టైటిల్‌ను పరిశీలిస్తు్న్నారట మేకర్స్. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'తమ్ముడు'. మరి ఈ టైటిల్ అఖిల్‌కు ఎంతవరకు లక్ తీసుకొస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com