Agent Teaser: 'ఏజెంట్' టీజర్ రిలీజ్.. వైల్డ్ రైడ్‌కు రెడీ అంటున్న అఖిల్..

Agent Teaser: అక్కినేని చిన్నోడు అఖిల్.. ఇప్పటివరకు లవ్ స్టోరీలతోనే తన లక్‌ను పరీక్షించుకున్నాడు. కానీ మొదటిసారి 'ఏజెంట్'లాంటి ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి అఖిల్ ఈసారి కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నాడని ప్రేక్షకులకు అర్థమయిపోయింది. ఇక తాజాగా విడుదలయిన టీజర్ చూస్తుంటే ఈ విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరోలను స్టైలిష్‌గా చూపించడంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. అలాంటి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ఏజెంట్. అందుకే ఇందులో అఖిల్ ఫిట్‌నెస్ దగ్గర నుండి లుక్ వరకు అన్నీ మారిపోయాయి. పైగా షర్ట్‌లెస్‌గా విడుదలయిన అఖిల్ పోస్టర్లు ఇప్పటికే యూత్‌ను బాగా ఆకట్టుకున్నాయి.
సాక్షి వైద్య.. ఏజెంట్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతుంది. టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయింది. అంతే కాకుండా ప్రొడక్షన్ వాల్యూ, గ్రాఫిక్స్ కూడా చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. సీనియర్ మలయాళ నటుడు మమ్ముట్టి చాలాకాలం తర్వాత ఏజెంట్‌తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నారు. హిప్‌హాప్ తమిరా ఇచ్చిన బీజీఎం టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. మొత్తంగా ఏజెంట్‌తో అఖిల్.. ఓ వైల్డ్ రైడ్‌కు రెడీ అయినట్టు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com