Koratala Siva : కొరటాలతో అక్కినేని అఖిల్ ..?

Koratala Siva : కొరటాలతో అక్కినేని అఖిల్ ..?
Koratala Siva : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా కొరటాల శివ కొనసాగుతున్నారు.

Koratala Siva ; తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ లేని దర్శకుడిగా కొరటాల శివ కొనసాగుతున్నారు .. చేసిన ప్రతి సినిమా హిట్ అవడంతో ఈ దర్శకుడికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.. సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ హంగులతో కొరటాల సినిమాలను తెరకెక్కిస్తారు. దీనితో కొరటాల నుంచి వచ్చే ప్రతి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటున్నాయి.. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేయనున్నారు.. అయితే ఎన్టీఆర్ తో సినిమా తర్వాత అక్కినేని అఖిల్ తో కొరటాల శివ సినిమా చేయనున్నట్లుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతుంది.. ఇప్పటికే నాగార్జునను సంప్రదించి ఓ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. దీనిపైన త్వరలోనే ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

కాగా ప్రస్తుతం అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story