టాలీవుడ్

మహేష్ బాబు రిలీజ్ చేసిన 'నాంది' ట్రైలర్‌‌కి సూపర్భ్ రెస్పాన్స్

ఈ ట్రైలర్ ‌లో అదిరిపోయే సీన్స్ చాలా ఉన్నాయి.

మహేష్ బాబు రిలీజ్ చేసిన నాంది ట్రైలర్‌‌కి సూపర్భ్ రెస్పాన్స్
X

సిల్వర్ స్క్రీన్ పై తనదైన అల్లరితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్. అయితే ఇప్పుడు తన పంథా మార్చుకుని నాంది అనే ప్రయోగాత్మక చిత్రంతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 19న రిలీజ్ అవుతోంది. ఇటీవల టీజర్లతో ఇంప్రెస్ చేసిన టీమ్.. ఇవాళ ట్రైలర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మహేష్ బాబు రిలీజ్ చేసిన నాంది ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ ట్రైలర్ ‌లో అదిరిపోయే సీన్స్ చాలా ఉన్నాయి. ట్రైలర్ ఎంతో ఇంటెన్స్‌గా ఉంది. అల్లరి నరేష్ కూడా అదరగొట్టాడు. ట్రైలర్‌లో కొన్ని సీన్స్‌లో న్యూడ్‌గా కనిపించాడు. తను చేయని హత్య వల్ల శిక్ష అనుభవిస్తోన్న నరేష్ ఎలా ఆ కేసు నుంచి బయటపడ్డాడు. దానికి కారణం ఎవరు అనేక కోణంలో మూవీ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లాయ‌ర్ గా నటిస్తోంది. శ్రీచ‌ర‌ణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు.

Next Story

RELATED STORIES