నాంది.. కలెక్షన్ల జోరు.. !

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'నాంది' సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన అల్లరి నరేశ్ పేరు ఇప్పుడు నాంది నరేశ్ గా మారిందనడంలో డౌట్ లేదు. ఈ సినిమా 11 రోజులో ప్రపంచవ్యాప్తంగా రూ.4.63 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికే రూ.2.7 కోట్ల ప్రీ బిజినెస్ చేసింది. న్యాయవ్యవస్థలో లోపాల వల్ల నేరం చేయని వారికి కష్టాలు, సామాన్యుని పోరాటం ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమా అద్భుతంగా సాగుతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న తెరకెక్కించారు. ఇందులో నరేష్ కి జోడిగా నవామి గాయక్ నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్, ప్రియదర్శి, దేవీప్రసాద్, వినయ్ వర్మ, సి.ఎల్.నరసింహారావు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com