Allu Aravind: సినిమాను ప్రమోట్ చేయడానికే మహేశ్ అలా చేశారు: అల్లు అరవింద్

Allu Aravind: సినిమా ప్రమోషన్స్ అనేవి ఆ సినిమా ఫలితాన్ని చాలావరకు నిర్ణయిస్తాయి. ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ.. సినిమా గురించి ఎక్కువ విశేషాలు పంచుకుంటూ ఉంటే.. ఆ మూవీ చూడడానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తారు. అలా జరగకపోవడం వల్లే ఎన్నో చిన్న సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో కూడా తెలియదు. అందుకే ప్రమోషన్స్‌పై నిర్మాత అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఎంత పెద్ద హీరో అయినా.. ఈ మధ్య తమ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి స్వయంగా ముందుకొస్తున్నారు. అలాగే సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్‌లో మహేశ్ బాబు స్వయంగా స్టేజ్ మీదకు వచ్చి డ్యాన్స్ చేశాడు. ఇది కూడా ఓ రకమైన ప్రమోషన్‌లాంటిదే అని అల్లు అరవింద్ అన్నారు. మహేశ్ పేరును నేరుగా వెల్లడించకపోయినా ఓ అగ్ర హీరో అంటూ తన గురించి ప్రస్తావించారు.
గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' చిత్రం ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు అల్లు అరవింద్. అక్కడే ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్మాతలను చూసి ప్రేక్షకులు థియేటర్లకు రారని, అందుకే సినిమాలను హీరోహీరోయిన్లు ప్రమోట్ చేసి వారిని థియేటర్‌కు వచ్చేలా చేయాలన్నారు. అందుకే గోపీచంద్ వస్తేనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా సూచించారట. ఇక గోపీచంద్, రాశి ఖన్నా కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పక్కా కమర్షియల్' జులై 1న విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com