Allu Arjun : టాంజేనియాలో ఐకాన్ స్టార్ ఫ్యామిలీ

Allu Arjun : టాంజేనియాలో ఐకాన్ స్టార్ ఫ్యామిలీ
Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి టాంజేనియాలో ఎంజాయ్ చేస్తున్నారు.

Cinema: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి టాంజేనియాలో ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ కానుంది. ఒక్కసారి షూట్ ప్రారంభమైందంటే ఇక అల్లు అర్జున్ బిజీగా ఉంటారు. ఫ్యామిలీతో సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఐకాన్ స్టార్ టాంజేనియా టూర్ లో ఉన్నారు. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహ తన ఇస్టాగ్రాంలో షేర్ చేశారు. టాంజేనియాలోని సెరెంగటి నేషనల్ పార్క్ లో అల్లు అర్జున్, స్నేహ, అయాన్, అర్హ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పుష్ప సినిమాతో అల్లు క్రేజ్ బాలీవుడ్ లో ఆమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లలో రికార్డుల మోత మోగించింది. బాలీవుడ్ ను తలదన్నే తీరులో పుష్ప, కేజీఎఫ్, విక్రమ్ లాంటి సౌత్ సినిమాలు కలెక్షన్లు కురిపించాయి. పుష్ప 2లో విజయ్ సేతుపతి కూడా అలరించనున్నట్లు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అల్లు అర్జున్, ఫహాద్ ఫాసిల్, విజయ సేతుపతి ఒకే స్క్రీన్ లో సౌత్ ఇండస్ట్రీని షేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. 2023లో పుష్ప పార్ట్ 2 రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story