Pushpa 2: 'పుష్ప'కు భారీ ఆఫర్.. నో చెప్పిన అల్లు అర్జున్..

Pushpa 2: పుష్పకు భారీ ఆఫర్.. నో చెప్పిన అల్లు అర్జున్..
Pushpa 2: బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘పుష్ప’. పాన్ ఇండియా సినిమాలకు పుష్ప ఓ కొత్త ఊపునిచ్చింది.

Pushpa 2: అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది 'పుష్ప'. పాన్ ఇండియా సినిమాలకు పుష్ప ఓ కొత్త ఊపునిచ్చింది. దీంతో బన్నీ క్రేజ్ కూడా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయింది. పుష్ప మ్యానరిజం సినిమాకు మరింత హైప్‌ను తెచ్చిపెట్టింది. దీంతో పుష్ప పార్ట్ 2పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అల్లు అర్జున్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పుష్ప ది రైజ్‌ను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ సినిమాతో ఆ సంస్థ లాభాల్లో మునిగి తేలింది. దీంతో పుష్ప పార్ట్ 2 నిర్మాణంలో గీతా ఆర్ట్స్‌ను కూడా భాగం చేయాలని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. అందుకే పుష్ప పార్ట్ 2 బిజినెస్ విషయాలను తానే దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పుష్ప పార్ట్ 2 స్క్రిప్ట్‌కు ఫైనల్ మెరుగులు దిద్దిన సుకుమార్.. త్వరలోనే దీనిని సెట్స్‌పై తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు.

పుష్ప మొదటి భాగం.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయ్యింది. అయితే పార్ట్ 2 థియేటర్లలో విడుదల కాకముందే ఓ ఓటీటీ సంస్థ నుండి రూ.100 కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందట. కానీ ఇప్పుడే పార్ట్ 2 గురించి ఏ డీల్స్ చేయవద్దని అల్లు అర్జున్ సూచించాడట. ఇక పుష్ప పార్ట్ 2 పూర్తయిన తర్వాతే మరో సినిమాను సైన్ చేయాలనుకున్న బన్నీ.. ఇప్పటికి ఏ డైరెక్టర్‌కు ఓకే చెప్పలేదు.

Tags

Read MoreRead Less
Next Story