Pushpa : రెండు భాగాలుగా బన్నీ ' పుష్ప' ..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
అదేటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట. ఈ ఏడాదిలో పుష్ప మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్ అని సమాచారం.అయితే దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com