స్టైలిష్ స్టార్ అర్జున్ పై రోల్ రైడా ర్యాప్

స్టైలిష్ స్టార్ అర్జున్ పై రోల్ రైడా ర్యాప్

యంగ్ హీరో అల్లు అర్జున్ యువతకు ఓ స్టైలిష్ ఐకాన్. అతడి సినిమాల్లో కొత్తదన్నాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. యూత్‌ని అలరించే స్టెప్పులు, పాటలతో సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్తాడు. అందుకే అతడికి సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ ఎక్కువ. అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. బుట్ట బొమ్మా పాటకు బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం స్టెప్పులు వేసి ముచ్చట పడ్డారు. ఈ చిత్రంలోని పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

టాలీవుడ్‌లో ప్రయోగాలు చేసే ఏకైక వ్యక్తి అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ర్యాప్ సాంగ్ యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. తెలుగోడి స్టైల్ మనమేలే బ్రాండ్ అంటూ సాగే ఈ ర్యాప్ సాంగ్‌ను తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా రాసి పాడాడు. బన్నీ నటించిన మొదటి చిత్రం గంగోత్రి నుంచి ఇటీవల వచ్చిన అలవైకుంఠపురంలో చిత్రం వరకు ఆయన పోషించిన పాత్రలు, డైలాగులతో ఈ పాటను మలిచారు. ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story