Allu Arjun Bimbisara: 'బింబిసార' చూసిన అల్లు అర్జున్.. రివ్యూ ఏంటంటే..?

Allu Arjun Bimbisara: కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన 'బింబిసార' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దర్శకుడు వశిష్టకు ఇది మొదటి చిత్రమే అయినా.. బాగా హ్యాండిల్ చేశాడు అంటూ ప్రశంసలు పొందుతున్నాడు. పలువురు స్టార్ హీరోలు సైతం బింబిసార చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా బింబిసార చూశాడు. ఆపై సినిమాపై తన అభిప్రాయం ఏంటో ట్వీట్ చేశాడు.
తెలుగులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రాలు చాలా తక్కువ. అలా నూతన కథాంశంతో ఏ సినిమా వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇప్పుడు అలాంటి కథాంశంతోనే బింబిసార తెరకెక్కింది. టైమ్ ట్రావెల్ కథకు కాస్త పీరియాడిక్ డ్రామా జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది మూవీ టీమ్. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీకి ఫిదా అయిపోతున్నారు.
బింబిసార చూసిన అల్లు అర్జున్ మూవీని ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. 'బింబిసార టీమ్‌కు అభినందనలు. ఇది ఒక ఆసక్తికరమైన ఫ్యాంటసీ సినిమా. కళ్యాణ్ రామ్ గారు అద్భుతం. కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. కొత్త తరహా సినిమాలు చేస్తున్నందుకు ఆయనను నేను గౌరవిస్తాను. సినిమాను బాగా హ్యాండిల్ చేసినందుకు డెబ్యూ డైరెక్టర్ వశిష్టను నేను మెచ్చుకుంటున్నాను. ప్రతీ వయసు వారికి బింబిసార ఒక ఎంటర్‌టైన్మెంట్' అంటూ మూవీ టీమ్‌ను అభినందించాడు బన్నీ.
Big congratulations to #Bimbisara team . Very interesting & an engaging fantasy film . Impactful presence by @NANDAMURIKALYAN garu . My respect for him for always bringing in new talent into the industry & attempting new kind of films.
— Allu Arjun (@alluarjun) August 7, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com