Sarkaru Vaari Paata: 'సర్కారు వారి పాట' కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..?

Sarkaru Vaari Paata: పరశురామ్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సర్కారు వారి పాట'కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. అందుకే కలెక్షన్ల విషయంలో కూడా ఈ సినిమా ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇందులో మహేశ్ మ్యానరిజం, మాస్ డైలాగులు, ఫైట్లు.. ఇవన్నీ అభిమానులకు ఫుల్ ఫీస్ట్‌లాగా మారాయి. అయితే ముందుగా సర్కారు వారి పాట కోసం వేరే హీరోను అనుకున్నారట. కానీ ఫైనల్‌గా అది మహేశ్ చేతికి వచ్చింది.
ముందుగా దర్శకులు ఓ హీరోను మైండ్‌లో పెట్టుకొని సినిమా కథను తయారు చేస్తారు కానీ ఆ కథ వారికి నచ్చుతుందని.. అనుకున్న హీరోతోనే సినిమా పట్టాలెక్కుతుందని చెప్పడం మాత్రం కష్టం. అలా ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే సర్కారు వారి పాట కూడా ముందుగా వేరే స్టార్ హీరో చేతికి వెళ్లిందట.
సర్కారు వారి పాట కోసం ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను సంప్రదించిందట మూవీ టీమ్. కానీ అప్పటికే బన్నీ.. 'పుష్ప' మూవీతో బిజీగా ఉండడంతో తను సర్కారు వారి పాటకు నో చెప్పాడట. దీంతో సర్కారు వారి పాట కథ మహేశ్ చేతికి వచ్చింది. మహేశ్‌కు కథ నచ్చడంతో తను ఓకే చేశాడు. ఇక మహేశ్ ఓకే చేసిన తర్వాత తనకు సూట్ అయ్యే విధంగా కథలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com