అల్లు అర్హ డబ్‌స్మాష్.. నా ఫేవరెట్ హీరోయిన్

అల్లు అర్హ డబ్‌స్మాష్.. నా ఫేవరెట్ హీరోయిన్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల కూతురు అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో బన్నీ అభిమానులను ఆకట్టుకుంటుంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహారెడ్డిల కూతురు అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో బన్నీ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక అర్హ అల్లరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా అర్హ చెప్పిన డబ్ స్మాష్ వీడియోను పోస్ట్ చేసింది స్నేహ.

ఇన్‌స్టాలో ఫేమస్ అయిన డైలాగ్.. అచ్చు తుమ్ఘారా ఫేవరెట్ హీరోయిన్ కౌన్ అని ఓ అబ్బాయి అంటే ఓ అమ్మాయి గొంతు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అంటుంది. వెంటనే స్పెల్లింగ్ చెప్పమని అడిగితే అలియా భట్ హై అంటూ వస్తుంది. ఈ డైలాగ్‌కి అర్హ తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో డబ్ స్మాష్ చేసింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ఇప్పటికే పదమూడు వేల లైక్స్‌ని సొంతం చేసుకుంది.

అర్హ వైట్ డ్రెస్‌లో క్యూట్‌గా కనిపించింది. కాగా అర్జున్ సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. ఆగస్ట్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Read MoreRead Less
Next Story