'పుష్ప' షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి..

పుష్ప షూటింగ్‌లో విషాదం.. గుండెపోటుతో స్టిల్ ఫోటోగ్రాఫర్ మృతి..
దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మారేడు మిల్లి అడవుల్లో జరుగుతోంది. కాగా ఈ చిత్రానికి స్టిల్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్న జి. శ్రీనివాస్ (54) సెట్స్‌పైనే గుండెపోటుకు గురై కన్ను మాశారు.

దీంతో చిత్ర సీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. షూటింగ్ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా మారేడు మిల్లి వెళ్లిన జి. శ్రీనివాస్ శుక్రవారం ఉదయం షూటింగ్ లొకేషన్‌లో అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్.. చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన కన్నుమూశారు. దాదాపు 200లకు పైగా చిత్రాలకు శ్రీనివాస్ స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story