Allu Sirish : అల్లు, అను రొమాన్స్... తగ్గేదేలే!

Allu Sirish : అల్లు శిరీష్ , అనూ ఇమ్మాన్యుయేల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. గీత ఆర్ట్స్ 2 తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి విజేత ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ప్రీ లుక్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో శిరీషను హాట్ ఫోజు లుక్ ఇచ్చారు. మే 30న అల్లు శిరీష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఆ రోజే వెల్లడించనున్నారు. అయితే ప్రీ లుక్ ఇలా ఉంటే ఇంకా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో అని నెటిజన్లు చర్చించుకుంటారు. కాగా రీసెంట్‌గా అల్లు శిరీష్ సిక్స్ ప్యాక్ లుక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. శిరీష్ కి ఇది 6 వ చిత్రం కావడం విశేషం.
Excited to be sharing the title & first look of #Sirish6 on May 30 (Sunday, 11am) @ItsAnuEmmanuel @GA2Official #rakeshsashii pic.twitter.com/4jOYadlxkx
— Allu Sirish (@AlluSirish) May 27, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com