Amala Paul: రెండో పెళ్లిపై అమలాపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇప్పుడే చెప్పలేను!

Amala Paul: సినీ పరిశ్రమలో ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోవాలంటే నటీమణులు కాస్త ఆలోచిస్తారు. కానీ కెరీర్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు అనుకునే వారు మాత్రం వెంటనే పెళ్లి కూడా చేసేసుకుంటారు. బాలీవుడ్ హీరోయిన్లు ఇలా చేసినా.. సౌత్ భామలు మాత్రం కెరీర్ విషయంలో అంతగా రిస్క్ చేయరు. కానీ అమలాపాల్ అలా కాదు.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుంది.
తమిళ దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే వారిద్దరూ విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఓ వ్యాపారవేత్తను నిశ్చితార్థం చేసుకుంది అమలాపాల్. కానీ అది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. దీంతో ప్రస్తుతం తన ఫుల్ ఫోకస్ కెరీర్‌పైనే పెట్టింది. తెలుగులో తనకు పెద్దగా అవకాశాలు రాకపోయినా.. తమిళంలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది.
ఇటీవల 'మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే.. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?' అని అమలాపాల్‌ను ఓ అభిమాని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అమలాపాల్.. తనకు తనకు ఇప్పుడైతే మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం తనను తాను ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నానని తెలిపింది. అందుకే తనను పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడే చెప్పలేనంది. దీంతో అమలాపాల్ అసలు రెండో పెళ్లి గురించి ఏం ఆలోచిస్తుందో తెలియడం లేదంటూ ప్రేక్షకులు కన్ఫ్యూజన్‌లో పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com