Amma Rajasekhar: గోపీచంద్ నన్ను మోసం చేశాడు: అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar: మామూలుగా డైరెక్టర్, హీరోల మధ్య మనస్పర్థలు రావడం సహజం. కానీ చాలావరకు అవి వారి మధ్యలోని ఉండిపోతాయి. ప్రేక్షకుల వరకు అవి రానివ్వకుండా జాగ్రత్తపడతారు. కానీ ఏదో ఒక సందర్భంలో అవి బయటికి వచ్చేస్తాయి. ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ చేస్తున్నది కూడా అదే. డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఫేడవుట్ అయిపోయిన తర్వాత అమ్మ రాజశేఖర్ హీరోలపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
ఒకప్పుడు డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు పనిచేశారు అమ్మ రాజశేఖర్. కానీ మెల్లగా ఆయన కెరీర్ డౌన్‌ఫాల్ అయ్యింది. ఇక ఇటీవల బిగ్ బాస్‌లో కనిపించిన తర్వాత అమ్మ రాజశేఖర్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అందుకే మళ్లీ నటుడిగా, డైరెక్టర్‌గా తన కెరీర్‌ను పున: ప్రారంభించారు. అలా `హైయ్ ఫైవ్` అనే చిత్రాన్ని తెరకెక్కించి తానే హీరోగా నటించారు.
ఇటీవల ఈ మూవీ ఈవెంట్‌లో మాట్లాడిన అమ్మ రాజశేఖర్.. నితిన్‌ను ఈవెంట్‌కు పిలిస్తే రాలేదని, అసలు తనకు డ్యాన్స్ నేర్పించిందే నేను అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనిపై నితిన్ ఇంకా స్పందించలేదు. ఇక ఇప్పుడు గోపీచంద్‌పై విరుచుకుపడ్డారు అమ్మ రాజశేఖర్. వీరిద్దరిలో కాంబినేషన్‌లో వచ్చిన 'రణం' సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో గోపీచంద్‌తో మరో సినిమా చేయాలనుకున్నారట ఈ డైరెక్టర్. అందుకే తనకొక స్టోరీ లైన్ కూడా వినిపించారట.
అదే సమయంలో వెంకటేశ్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో అదే స్టోరీ లైన్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట అమ్మ రాజశేఖర్. అదే సమయంలో గోపీచంద్ నటించిన 'శంఖం' తన స్టోరీ లైన్‌తోనే తెరకెక్కిందని గమనించారట. దీంతో వెంకటేశ్‌తో సినిమా ఛాన్స్ పోయిందని పేర్కొ్న్నారు ఈ డైరెక్టర్. అప్పటినుండే తన కెరీర్ ఇలా అయిపోయిందంటూ గోపీచంద్‌పై ఆరోపణలు చేశారు అమ్మ రాజశేఖర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com