Baby: 70 అడుగుల పోస్టర్‌తో 'బేబీ' రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్

Baby: 70 అడుగుల పోస్టర్‌తో బేబీ  రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా "బేబీ"

సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య లు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా "బేబీ". ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయిన "బేబీ" సినిమా టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందనే లభించింది. ఈ సినిమా మొదటి గ్లిమ్స్‌ వీడియో నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో బేబీ పట్ల అంచనాలు పెరిగాయి. ఇక ‘బేబీ’ మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ సినిమా జూలై 14న విడుదల కానున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు.

ఇదే విషయాన్ని ప్రసాద్ ఐ-మాక్స్ దగ్గర దాదాపు 70 అడుగుల విడుదల తేదీ పోస్టర్ తో ప్రకటించారు చిత్ర బృందం. ఈ చిత్రం టీజర్, సాంగ్స్ లాగానే కొత్త పోస్టర్ డిఫరెంట్ గా, సినీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. పోస్టర్ లాంచ్ కి ఆనంద్ దేవరకొండ,విరాజ్ అశ్విన్ ,వైష్ణవి చైతన్యలతో పాటు ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ అలానే నిర్మాత ఎస్ కే ఎన్, కో ప్రొడ్యూసర్ ధీరజ్ హాజరయ్యారు. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ట్రైలర్ ని వచ్చే వారంలో విడుదల చేయనున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం విజయ్ బుల్గానిన్ అందించారు.

Tags

Read MoreRead Less
Next Story