ఆనంద్ దేవరకొండ.. అంచనాలు పెంచేస్తున్నాడు..
వారసులుగా వచ్చిన వాళ్లు నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. వారసత్వం ఎంట్రీ కార్డ్ అయినా.. సర్వైవ్ కావాలంటే సత్తా చాటాల్సిందే. తొలి సినిమాతోనే ఆకట్టుకుని మలి సినిమాతో మెప్పించి.. ఇప్పుడు వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు దేవరకొండ కుర్రాడు. అంటే విజయ్ కాదు.. అతని తమ్ముడు ఆనంద్. ప్రస్తుతం పుష్పకవిమానంతో రాబోతోన్న ఆనంద్ దేవరకొండ బర్త్ డే ఇవాళ. ఈ సందర్భంగా మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడీ రౌడీగారి తమ్ముడు.
ఫస్ట్ మూవీతోనే ఎక్స్ పర్మెంట్ చేసి ఔరా అనిపించాడు ఆనంద్ దేవరకొండ. దొరసాని సినిమాతో బాగా ఆకట్టుకున్నాడు. ఈ మూవీ కమర్షియల్ గా పెద్ద విజయం సాధించకపోయినా.. విమర్శియల్ గా విపరీతంగా మెప్పించింది. ఆనంద్ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. నిజానికి డెబ్యూ మూవీగా ఇలాంటి కథలు ఎంచుకోవడం సాహసం. ఆ సాహసం చేసి సత్తా చాటాడు ఆనంద్.
తన రేంజ్‌కి తగ్గ కథలు ఎంచుకుంటూ కొత్తగా వస్తోన్న వారసత్వపు కుర్రాళ్లను ఆశ్చర్యపరుస్తున్నాడు ఆనంద్. అందులో భాగంగానే రెండో సినిమాగా మిడిల్ క్లాస్ మెలోడీస్ చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఆకట్టుకుంది. పైగా ఆనంద్ నటనలో ఫస్ట్ మూవీలో కనిపించిన చిన్న చిన్న మైనస్ లను కూడా చెరిపేసింది. కొంతమంది ఊహలకు భిన్నంగా పాగా వేస్తున్నాడు ఆనంద్.
ప్రస్తుతం ఆనంద్ నటించిన పుష్పక విమానం విడుదలకు సిద్ధమవుతోంది. ఇక తన బర్త్ డే సందర్భంగా రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు. అందమైన కథలను ఎంచుకుంటూ ఆకట్టుకునే మధుర శ్రీధర్ బ్యానర్ లో ఆనంద్ ఓ మూవీ చేస్తున్నాడు. మధుర ఎంటర్టైన్మెంట్స్ తో పాటు రోల్ కెమెరా యాక్షన్ అనే సంస్థ కూడా ఈ నిర్మాణంలో భాగస్వామి. అలాగే హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మరో మూవీ రాబోతోంది.
ఈ ప్రొడక్షన్ లో రాబోతోన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఈ మూవీతో ఉదయ్ శెట్టి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఇతర కాస్ట్ అండ్ క్రూ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. మొత్తంగా విజయ్ దేవరకొండ తమ్ముడుగా వచ్చినా తనదైన ముద్ర వేసేందుకు చాలా వేగంగా దూసుకుపోతోన్న ఆనంద్ కు మనమూ బర్త్ డే విషెస్ చెబుదాం..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com