Ananya Nagalla: ఆ మాట వినగానే గాల్లో తేలిపోయా.. పవన్ సర్ చిత్రంలో నటించే అవకాశం..: నటి అనన్య

పరభాషా నటులే టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారనుకుంటే పొరపాటే.. టాలెంట్ ఉంటే మనవాళ్లు కూడా సినిమా పరిశ్రమలో రాణించొచ్చు అంటోంది 'మల్లేశం' ఫేం అనన్య నాగళ్ల. తాను నటించిన మరో చిత్రం 'ప్లేబ్యాక్' కూడా హిట్టవడంతో తన అదృష్టాన్ని తానే నమ్మలేకపోతోంది. చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అనన్య సరదా సంగతులను పంచుకున్నారు.
ప్లేబ్యాక్ చిన్న సినిమా అయినా చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా మారడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అయిదంకెల జీతాన్ని అందుకున్నా రాని సంతోషం మంచి సినిమాల్లో అవకాశాలు రావడం మరింత సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పింది.
పవన్‌కళ్యాణ్ చిత్రం వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. అందులో ప్రాధాన్యమున్న పాత్ర దక్కడం మరింత సంతోషం.. చెప్పడానికి మాటలు కూడా రావట్లేదని అంటోంది. హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ కూడా తన తదుపరి చిత్రంలో అవకాశం ఇస్తాననగానే గాల్లో తేలిపోయాను.
ప్రతిభ ఉన్న నటీ నటులను ప్రోత్సహించే సుకుమార్ సర్.. మల్లేశంలో చేసిన కొందరికి పుష్పలో నటించే అవకాశం కల్పించారు. అది ఆయన గొప్పతనం అని అనన్య చెబుతూ బాలీవుడ్ భామలే కాదు తెలుగు అమ్మాయిలు నిరభ్యంతరంగా ఇండస్ట్రీలోకి రావచ్చు. తమ ప్రతిభకి పదును పెట్టే పాత్రలొస్తే తమని తాము నిరూపించుకోవచ్చు అని ఘంటాపదంగా చెబుతోంది అనన్య నాగళ్ల.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com