Ananya Panday: విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా: అనన్య పాండే

Ananya Panday: విజయ్ దేవరకొండ నా బుజ్జి కన్నా: అనన్య పాండే
X
Ananya Panday: ‘లైగర్’కు ప్రమోషన్స్ చేస్తున్నాడు విజయ్. తనతో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొంటోంది.

Ananya Panday: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఎంతోమంది అమ్మాయిలకు క్రష్‌గా మారిపోయాడు. ముఖ్యంగా యూత్‌లో ఈ హీరోకు చాలా క్రేజ్ ఉంది. అందుకే అన్ని రాష్ట్రాలు చుట్టేస్తూ విజయ్.. తన అప్‌కమింగ్ మూవీ 'లైగర్'కు ప్రమోషన్స్ చేస్తున్నాడు. తనతో పాటు హీరోయిన్ అనన్య పాండే కూడా పాల్గొంటోంది.

లైగర్ సినిమా విజయ్ కెరీర్‌లోనే మొదటి పాన్ ఇండియా చిత్రం. అందుకే ఈ సినిమా సక్సెస్‌ను విజయ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులు ఉన్నా కూడా ఇతర షూటింగ్స్‌లో పాల్గొనకుండా లైగర్ ప్రమోషన్స్‌లోనే బిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటివరకు నార్త్ స్టేట్స్‌లో ప్రమోషన్స్ ముగించుకున్న విజయ్, అనన్య తాజాగా తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టారు.

ఇటీవల విజయ్ దేవరకొండ ఇంట్లో తన తల్లి లైగర్ సినిమా సక్సెస్ కోసం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో విజయ్, అనన్య పాల్గొన్నారు. ఇదే విషయాన్ని అనన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. 'నా బుజ్జి కన్నాతో కలిసి పూజా బ్రేస్‌లెట్‌ను ధరించాను. మాధవి ఆంటీకి థాంక్యూ' అని చెప్పుకొచ్చింది అనన్య. ఇది మాత్రమే కాదు ఇంతకు ముందు చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులలో కూడా అనన్య.. విజయ్‌ను బుజ్జి కన్నా అనే పిలవడం గమనార్హం.



Tags

Next Story