Anasuya Bharadwaj: స్టేజ్‌పైనే అనసూయ అందంపై కామెంట్స్ చేసిన డైరెక్టర్..

Anasuya Bharadwaj: కొంతమంది సినీ సెలబ్రిటీలు వారికి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి ఎన్నో కాంట్రవర్సీలకు దారితీస్తాయి. కానీ చాలాసార్లు అవి కొన్నాళ్ల వరకు నెట్టింట్లో చర్చించుకునే అంశంగా మారిపోతాయి. తాజాగా క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం అనసూయ అందంపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బుల్లితెర నుండి ఎంతోమందిని వెండితెరపైకి తీసుకొచ్చిన సినిమా 'వాంటెడ్ పండుగాడ్'. సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఇందులో అనసూయ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
అనసూయ ఏవీ చూసి తనది అసూయ చెందే అందమని తనికెళ్ల భరణి తనతో అన్నారని బయటపెట్టారు హరీష్ శంకర్. అదేదో స్టేజిమీదే చెప్పొచ్చు కదా అంటే.. ఇలా లాల్చీ, పైజామా వేసుకొని భస్మం పెట్టుకొని శంకరా అనుకునే తాను చెప్తే బాగోదు అన్నారన్నారు. అందుకే తనికెళ్ల భరణి తరపున తాను అనసూయ గురించి చెప్పానని స్పష్టం చేశారు హరీష్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com