ఆ అనుభూతి మళ్లీ పొందాలని.. అందుకే ఇంకోసారి..: అనసూయ

ఆ అనుభూతి మళ్లీ పొందాలని.. అందుకే ఇంకోసారి..: అనసూయ
ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్ గా మాట్లాడేస్తుంది

యాంకర్ గా ఎన్ని వగలు పోయినా వెండి తెర మీద ఏదైనా పాత్రకు అవకాశం వచ్చిందంటే దటీజ్ అనసూయ అనిపించుకుంటుంది ఈ జబర్ధస్త్ బ్యూటీ. ఇద్దరు పిల్లల తల్లైనా మరొకరిని కనడానికి నాకేం అభ్యంతరం లేదంటోంది. ఎవరేమనుకుంటే నాకేంటి అని ఏ విషయమైనా బోల్డ్ గా మాట్లాడేస్తుంది.. అదే ఒక్కోసారి ఆమెను ఇరుకున పడేస్తుంది.. ట్రోల్ చేసి నెటిజన్స్ అనసూయను ఆటపట్టించినా వాళ్లకీ సరైన సమాధానమే ఇస్తుంది. ప్రస్తుంతం 'థ్యాంక్యూ బ్రదర్' అనే చిత్రంలో నటిస్తోంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అనసూయ గర్భవతిగా కనిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనసూయ మాతృత్వంలో ఉన్న ఆనందం గొప్పదని, మరోసారి గర్భవతి అయి ఆ అనుభూతిని ఆస్వాదించాలని ఉందని తన మనసులోని మాటను వెల్లడించింది. గతంలో పొందిన మాతృత్వపు మధురిమలను మళ్లీ పొందాలని ఉందని, అందుకే మళ్లీ తల్లి కావాలనుకుంటున్నా అని అనసూయ చెప్పింది.

Tags

Next Story