Anasuya Bharadwaj: 'జబర్దస్త్' మేకర్స్‌కు షాక్.. అనసూయ కూడా ఔట్.. పోస్ట్‌తో వెల్లడి..

Anasuya Bharadwaj: జబర్దస్త్ మేకర్స్‌కు షాక్.. అనసూయ కూడా ఔట్.. పోస్ట్‌తో వెల్లడి..
Anasuya Bharadwaj: అనసూయ.. ఓవైపు జబర్దస్త్ యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది.

Anasuya Bharadwaj: వారానికి ఓసారి ఇన్నేళ్లు ఓ స్టాండప్ కామెడీ షో కూడా కొనసాగలేదు. దాదాపు ఎనిమిదేళ్ల నుండి ప్రేక్షకులను అలరిస్తోంది జబర్దస్త్. కానీ ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఆ షో లేదని చాలామంది ప్రేక్షకులు ఓపెన్‌గా కామెంట్ చేస్తున్నారు. చాలామంది ఫేమస్ కమెడియన్స్.. ఈ షో నుండి వెళ్లిపోవడం కూడా దీనికి కారణం. ఇక తాజాగా బజర్దస్త్ యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకోనుందని టాక్ వినిపిస్తోంది.


జబర్దస్త్‌తో పేరు సపాదించుకున్న తర్వాత ఎంతోమంది కమెడియన్లకు సినిమాల్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో.. చాలామంది కమెడియన్లు ఒక్కొక్కరిగా షోను వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా ఈ షోను వీడారు. ఇంతలోనే యాంకర్ అనసూయ కూడా షో నుండి తప్పుకోనుందని వార్తలు వస్తున్నాయి.


అనసూయ.. ఓవైపు జబర్దస్త్ యాంకర్‌గా చేస్తూనే సినిమాల్లో కూడా అవకాశాలు కొట్టేసింది. తాను చేసిన ఒకట్రెండు చిత్రాలు కూడా తనకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక మరోవైపు ఇతర ఛానెళ్ల నుండి కూడా అనసూయకు పిలుపు రావడంతో అప్పుడప్పుడే ఇతర షోలలో కూడా తళుక్కుమని మెరిసింది అనసూయ. ఇక జబర్దస్త్ షో నుండి దూరమవ్వడం గురించి అనసూయ ఓ పోస్ట్ కూడా షేర్ చేసింది.


'నా కెరీర్ గురించి పెద్ద నిర్ణయం తీసుకున్నాను. అది ఈరోజు అమలు చేశాను. నేను నాతో పాటు చాలా జ్ఞాపకాలను తీసుకెళ్తున్నాను. అందులో చాలావరకు మంచిది.. కొన్ని చెడ్డవి ఉన్నాయి. కానీ జీవితం నాకోసం ఇంకా దాచిపెట్టిందో చూడాలనుకుంటున్నాను. ఎప్పటిలాగానే మీరు కూడా నాతో పాటు ప్రయాణిస్తారు అనుకుంటున్నాను.' అని అనసూయ చేసిన పోస్ట్.. తాను జబర్దస్త్ మానేస్తుంది అనేదానికి సంకేతంగా కనిపిస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story