ఉత్కంఠ భరితంగా 'థ్యాంక్యూ బ్రదర్' ట్రైలర్!

బుల్లితెర వ్యాఖ్యాతగా అలరిస్తూనే, వైవిధ్యమైన పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ప్రధాన పాత్రలో 'థ్యాంక్యూ బ్రదర్' అనే సినిమా తెరకెక్కుతుంది. ఇందులో అనసూయతో పాటుగా విరాజ్ అశ్విన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన చిత్ర ట్రైలర్ ని మేకర్స్ ఈరోజు (గురువారం) విడుదల చేశారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ట్రైలర్ లో అనసూయ(ప్రియ) నిండు గర్భిణిగా కనిపించనుంది. ఒక రోజు ప్రియ, విరాజ్ అశ్విన్ లిఫ్ట్‌లో కలిసి కిందకు వెళ్తుండగా సడెన్‌గా షార్ట్‌సర్క్యూట్ అవుతుంది. దీనితో అప్పుడే ప్రియకు నొప్పులు మొదలవుతాయి. అప్పుడు ప్రియ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఆ యువకుడు ఏం చేశాడు? ప్రియ సేఫ్ గా ఉందా తెలియాలంటే 'థ్యాంక్యూ బ్రదర్' చూడాల్సిందే..
రమేశ్ రాపర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారకనాథ్‌రెడ్డిలు నిర్మిస్తున్నారు. గుణ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూరుస్తున్నారు. చిత్ర ట్రైలర్ తో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com