Anasuya Bharadwaj: వేశ్య పాత్రలో అనసూయ.. స్టార్ డైరెక్టర్‌తో సిరీస్..
Anasuya Bharadwaj: జబర్దస్త్ షోతో యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. మెల్లగా నటిగా మారింది.

Anasuya Bharadwaj: ఒక నటిగా గుర్తింపు సంపాదించాలంటే ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేయగలగాలి. అందుకే జబర్దస్త్ యాంకర్ అనిపించుకున్న అనసూయ.. నటిగా కూడా పూర్తిస్థాయిలో గుర్తింపు సంపాదించాలి అనుకుంటోంది. ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో వేశ్య పాత్ర చేయడానికి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
జబర్దస్త్ షోతో యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ.. మెల్లగా నటిగా మారింది. ఇక రంగస్థలం చిత్రంలో తాను పోషించిన రంగమ్మత్త పాత్ర నటిగా తన కెరీర్‌నే మలుపు తిప్పింది. ఆ తర్వాత పుష్పలో విలన్‌గా ఆకట్టుకుంది. ఇప్పుడు వేశ్యగా నటించి.. మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమవుతోందట అనసూయ. ఇలా సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుండడంతోనే తాను జబర్దస్త్ కూడా వదిలేసిందని సమాచారం.
స్టార్ డైరెక్టర్ క్రిష్.. ఓటీటీ సోనీ లివ్ కోసం ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నాడట. గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకం కథ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడుతుందని సమాచారం. ఇందులో మధురవాణి అనే వేశ్య పాత్రలో అనసూయ కనిపించనుందట. దీంతో పాటు అరి, ధర్జా అనే చిత్రాల్లో కూడా అనసూయ లీడ్ రోల్స్‌లో నటిస్తోంది.
RELATED STORIES
Badam Tea: బాదం టీతో ఆరోగ్యం.. అందం కూడా..
11 Aug 2022 2:35 AM GMTCoffee with Ghee: క్రేజీ కాంబినేషన్.. నెయ్యితో కాఫీ
10 Aug 2022 6:00 AM GMTWater: ఎక్కువ నీరు త్రాగడం హానికరమా.. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు..
8 Aug 2022 9:15 AM GMTDiabetic Foot Symptoms: చక్కెర వ్యాధి గ్రస్తులకు పాదాల సమస్యలు.....
6 Aug 2022 9:30 AM GMTEight lifestyle tips: వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఎనిమిది...
4 Aug 2022 9:14 AM GMTHair Fall:వర్షాకాలంలో జుట్టుకి పోషణ.. వెంట్రుకలు రాలడం నివారించేందుకు...
3 Aug 2022 8:00 AM GMT