'ఖిలాడి' అనసూయ!

ఖిలాడి అనసూయ!
బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూనే వైవిధ్యమైన పాత్రలు వచ్చినప్పుడు వెండితెరపైన కూడా మెరుస్తుంది అనసూయ.

బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూనే వైవిధ్యమైన పాత్రలు వచ్చినప్పుడు వెండితెరపైన కూడా మెరుస్తుంది అనసూయ. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో గుర్తుండిపోయే పాత్ర‌ల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అయితే ఇప్పుడు అనసూయకి బంపర్ ఆఫర్ వచ్చింది.

అదేంటంటే.. మాస్ మహరాజా ర‌వితేజ హీరోగా, రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఖిలాడి టీమ్‌లోకి అన‌సూయ‌కు స్వాగ‌తం చెబుతున్న‌ట్లు ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది.

కాగా ఈ సినిమాలో అన‌సూయ గేమ్ ఛేంజ‌ర్ అని ద‌ర్శ‌కుడు కామెంట్ పెట్టారు. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story