Anchor Anasuya Bharadwaj : ఆరడజను సినిమాలతో అనసూయ.. ఈ ఏడాది రంగమ్మత్త ఫుల్ బిజీ!

Anchor Anasuya Bharadwaj (File photo)
Anchor Anasuya Bharadwaj : బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూనే మంచి మంచి పాత్రలు దక్కినప్పుడు వెండితెర పైన కూడా మెరుస్తుంటుంది యాంకర్ అనసూయ.. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఆఫర్స్ కొట్టేస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇదిలావుండగా 2021లో ఫుల్ షూటింగ్స్‌తో బిజీగా ఉండనుంది ఈ రంగమ్మత్త.. ప్రస్తుతం అనసూయ చేస్తున్న సినిమాల లిస్టు ఒక్కసారి చూసేద్దమా..!
1. అల్లు అర్జున్ - పుష్ప
అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం పుష్ప.. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అనసూయ ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ దీనిపైన అనసూయ ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
2. రవితేజ - ఖిలాడి
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఖిలాడి'. రమేశ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అనసూయ నటించనున్నట్లుగా చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది. ఇందులో అనసూయ ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం!
౩. కార్తికేయ - చావు కబురు చల్లగా
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'.. కౌశిక్ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాని బన్నీవాసు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ చేసేందుకు ఒకే చెప్పిందని సమాచారం. అయితే ఈ సాంగ్ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

4. కృష్ణవంశీ- రంగమార్తాండ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రంగమార్తాండ'.. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనసూయ కూడా ఓ కీలక పాత్రలో మెరుస్తోంది.
5. విరాజ్ అశ్విన్- థ్యాంక్యూ బ్రదర్
విరాజ్ అశ్విన్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం థ్యాంక్యూ బ్రదర్.. రమేష్ రాపర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయ గర్భవతిగా నటించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది.
6. ఇక కోలీవుడ్‌లోకి అనసూయ ఎంట్రీ ఇవ్వనుంది.. 'ది ఛేజ్' అనే టైటిల్ తో క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రైజా విల్సన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనసూయ కీలకపాత్రలో నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com