సునీల్ కి హీరోయిన్ గా అనసూయ?

సునీల్ కి హీరోయిన్ గా అనసూయ?
బుల్లితెర పై జబర్దస్త్‌ కామెడీ షోలో యాంకర్ గా చేస్తూనే మంచి మంచి పాత్రలు వస్తే వెండితెరపై , వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్దం అంటుంది అనసూయ

బుల్లితెర పై జబర్దస్త్‌ కామెడీ షోలో యాంకర్ గా చేస్తూనే మంచి మంచి పాత్రలు వస్తే వెండితెరపై , వెబ్ సిరీస్ లలో నటించేందుకు సిద్దం అంటుంది అనసూయ.. అయితే ఇప్పుడు హీరోయిన్ గా అనసూయకి మంచి ఛాన్స్ వచ్చింది. సునీల్‌ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా నటించేందుకు అనసూయను సంప్రదించారట మేకర్స్..

అయితే సినిమాలోని కథ,పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట అనసూయ. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. హరీష్ శంకర్ కథ అందించిన ఈ సినిమాని 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టలేక్కనుంది. అటు అనసూయ ప్రస్తుతం 'థాంక్యూ బ్రదర్'‌ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా మెగా డాటర్‌ నిహారికతో కలిసి ఓ వెబ్‌సిరీస్‌ లో నటిస్తుంది అనసూయ!

Tags

Read MoreRead Less
Next Story