టాలీవుడ్

యాంకర్‌ ప్రదీప్‌ నెల సంపాదన ఎంతో తెలుసా?

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్.. అత్తా కోడళ్ళు షోతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రదీప్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు.

యాంకర్‌ ప్రదీప్‌ నెల సంపాదన ఎంతో తెలుసా?
X

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్.. అత్తా కోడళ్ళు షోతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రదీప్ మొదట్లో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా ఎదిగాడు. తాజాగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో హీరోగా మారి.. తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్నాడు. మంచి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే పలు టీవీ షోలు, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రదీప్.. నెలకు ఎంత సంపాదిస్తున్నాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రదీప్ దాదాపు ఏడాదికి ఆరు కోట్లకు పైగా సంపాదిస్తున్నాడనే టాక్ ఫిలిం నగర్ లో నడుస్తోంది. గతంలో ఒక్కో ఎపిసోడ్‌కు ప్రదీప్ రూ 75 వేల వరకు తీసుకునేవాడట. కానీ ఇప్పుడు లక్షన్నరకు పైగా తీసుకుంటున్నాడనే ప్రచారం నడుస్తోంది. కాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి గాను ప్రదీప్ పాతిక లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం.

Next Story

RELATED STORIES